4608..గజల్.
ఎంత వద్దు అనుకున్నా..తలచకుండ ఉండలేను..!
జ్ఞానమెంత ఇచ్చినావొ..చెప్పకుండ ఉండలేను..!
ఈ మనసును పసిడిమల్లె..తోటలాగ మార్చినావు..
పరిమళించు నీ గీతం..పాడకుండ ఉండలేను..!
అక్షరాల గగనాలను..పొదిగినావు గుండెలోన..
చెలిమిసిరుల గనులుతవ్వి..పంచకుండ ఉండలేను..!
ఎవ్వరినో విమర్శించు..పనేమిటో పరాయెవరు..
ఎదలోపలి గాయాలకు..మురవకుండ ఉండలేను..!
గుండెచాటు ఆవేదన..చాటుభాష తెలియదులే..
వ్రాసుకున్న లేఖలన్ని..చింపకుండ ఉండలేను..!
ఊసులాడు గాలికన్న..నేస్తమెవరు లోకంలో..
వింతవిషపు బానిసలను..వీడకుండ ఉండలేను..!
అనుభవాల తుఫానులో..చిక్కుకొంటి మాధవుడా..
నాలోలో ఉన్ననిన్ను..కూడకుండ ఉండలేను..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు