201..
నా మనస్సు పదే పదే నీ పేరే జపిస్తోంది..!!
నా హృదయం అదేపనిగ నీ కొరకే తపిస్తోంది..!!
ఏ గులాబినడిగినా..చెప్పదాయె నీ జాడే..
నా కవితయె..భావనగా నీ తలపే ధరిస్తోంది..!!
వసివాడని వసంతాలు పలకరించు స్వర్గంలో..
నా అడుగుల నీడలన్నీ నీ వలపే భరిస్తోంది..!!
విరహాలే కనుకొలకుల పొంగులెత్తు దారులలో..
నా ఆశల మేఘాలను నీ చూపే వరిస్తోంది..!!
అద్దమంటి కోరికసలు కానరాదె ఎంతకీ..
నా పాటకు పల్లవిలా నీ పిలుపే చరిస్తోంది..!!
ఓ 'మాధవ'! నీ రాధను కరుణించే వేణుధరా..!!
నా శ్వాసల మౌన సాక్షి నీ వెలుగే చలిస్తోంది..!!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు