231..
ఆశల చెట్టుకు పూసిన పువ్వులు రాలే దెప్పుడు..!?
నేలను వీడిన కోర్కెల పక్షులు వాలే దెప్పుడు..!?
తెలిసీ తెలియని ఆటగ సాగే కాలం ఒడిలో..
నేనూ నాదను గొడవల గొడుగులు కాలే దెప్పుడు..?!
తలవని తలపుగ కురిసే తలపుల వానలు లేవోయ్..!
అలలే తరగని తనువుల జలధులు మరిగే దెప్పుడు..?!
ప్రశ్నల గుడిగా ఎదిగిన మసుకు బడి ఈ భూమియె..!!
ఒదిగీ ఒదగని చిత్తపు బుద్ధులు మారే దెప్పుడు..?!
ఏ గగనాలను చేరగ చూతువు ఎద లోయలలో..!?
మెరుపుల ముద్దులు సోకక మబ్బులు కురిసే దెప్పుడు..?!
యుద్ధాలేవీ జరుగక శాంతికి తావే లేదోయ్..!!
తేనెల కొరకై తేటుల పరుగులు నిలిచే దెప్పుడు..?!
చక్కని చిక్కని రాధా మానస వేణువు నీవే..?!
'మాధవ' వేణువు నిండిన స్వరములు త్రాగే దెప్పుడు..?!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు