అమ్మ by శ్రవణ్ కుమార్ సమరెడ్డి (CRTL కవితల పోటీ 2021)
శ్రవణ్ కుమార్ సమరెడ్డి
అమ్మ
ఆమె నాకు జన్మనిచ్చింది
తన చేతులు ఉయలై నను ఆడించింది
తన ఒడిని పానుపు చేసి నను సేదతీర్చింది
తన పాట జోలపాటై నను నిద్రపుచ్చింది
వెన్నెలంటి తన చల్లని చూపు నను కాపుకాచింది
నా ముద్దు ముద్దు మాటలు విని తను మురిసిపోయింది
నే వేసే తప్పటడుగుల్లో గాయమైతె తను తల్లడిల్లింది
నా చిరునవ్వులు చూసి తన బాధలను మరచింది
తనే నాకు ప్రాణం పోసి ప్రేమ, అనురాగం, వాత్సల్యాలనే ఆశీస్సులతో నను అల్లారుముద్దుగా పెంచిన మాతృదేవతకు ప్రేమతో..."