Skip to main content

User account menu

  • Log in
Home

అమ్మ గెలుస్తుంది by P అరుణ్ కుమార్ (CRTL కవితల పోటీ 2021)

Breadcrumb

  • Home
  • అమ్మ గెలుస్తుంది by P అరుణ్ కుమార్ (CRTL కవితల పోటీ 2021)
P అరుణ్ కుమార్
అమ్మ గెలుస్తుంది

అంశం: వలస బ్రతుకులు

శీర్షిక:అమ్మ గెలుస్తుంది

సూరీడు మండుటెండగా తన ప్రతాపాన్ని చూపుతున్న మధ్యాహ్నవేళ...
బక్కపలుచని శరీరంతో....
ఆకలిని దిగమింగిన ..
కూడు దొరకని ఎముకలగూడుతో..
తన నడినెత్తిన బ్రతకాలనే బరువు ఆశను మోస్తూ...
తన చేతులలో ఆటాడుతున్న పిల్లల భవిష్యత్ ను చూస్తూ..
నిండు పున్నమి లో చుట్టూ అలుముకున్న అమావాస్య చీకటిలా ..
కరోనా అధిపత్యం చెలాయిస్తున్న అయోమయ ఆందోళన సందర్భంలో అడుగులు వేస్తూనే...
ఆక్సిజన్ సంకేతం తెలీని
ఓ అమ్మ అడుగుతోంది.. అందమైన ఈ ప్రకృతిని..!
ఇదేంటని...?
రేపు ఉంటుందా?
రేపటికి మనం వుంటామాఅని...?

కాలం కన్నెర్ర చేసిన ఈ పరిణామ విధ్వంసం లో..
వలస పక్షుల్లా...వలస జీవులమైన మాకు దారి కనపడుతూనే వుంది...!
కానీ గమనంలోని గమ్యమే అదృశ్యమవుతుందని..!

వైద్యుడు..దేవుడు ఎక్కడున్నాడో తెలీదు కానీ...
 విలన్ గా నటించిన సోనూసూద్  హీరోరూపంలో మానవత్వమై బ్రతికుడున్నాడని.. ప్రకృతి అంటోంది..ఆ అమ్మతో..!

పాపం,పుణ్యం ప్రక్కనపెడితే...
పుట్టిన ఊరికి చేరేలోపే పాణం వుంటుందా అనే సంశయం ఓ ప్రక్క..!
లాక్ డౌన్ అర్థం కాక,
అన్నం దొరకక ..
కాలే కడుపులో సంగీతం పసిగట్టలేని ఆకలి స్వరాలు ఇంకో ప్రక్క..!
ఎలాగైనా జీవిత ఆటలో గెలవాలనే ఆరాటం..
విధి విసిరేసిన వింత నాటకంలో నిలవాలనే నిరంతర పోరాటంతో...
బ్రతుకు దెరువు కోసం  బాటసారులై కదిలింది అమాయక ప్రజల
అమ్మల సైన్యం..!

వలస బ్రతుకులు కరోనాతో చేస్తున్న నిరంతర యుద్ధం..
అంతరాయం లేకుండా..
కొనసాగుతూనే వుంది.. ప్రభుత్వాల దయ దాక్షిణ్యాల మాయల మాటున...!!

ఏదేమైనా....
అమ్మ గెలుస్తుంది..!
పిల్లల్ని బ్రతికిస్తుంది..!
కరోనా ఏమి చేయలేక ఓడిపోతుంది..!
వలస జీవుల రాకతో పల్లెసీమలు  మళ్ళీ చిరునవ్వులు చిందిస్తూ...
పట్టణాలను ఎగతాళి చేస్తూనే వుంటాయి...!!
మళ్ళీ మన అనుకునే పాతరోజులొచ్చాయని..!!
By P Arun Kumar

రచనకు మీ మార్కులు ఇవ్వండి. పోటీ లో ఉన్న రచనలకు ఈ మార్కులు ప్రభావితం చేస్తాయి. బాగా అలోచించి మార్కులు ఇవ్వండి.
0
0
0
0
0
0
0
0
0
0
0
No votes have been submitted yet.
నాగర్ కర్నూల్

P.Arun kumar
Lecturer in Physics
STAR junior college
Nagarkurnool
Pin:509209
Phone:9394749536

జిల్లాల వారీగా కవులు  

కవులు వారి కవిత్వాలు  

కవులు వారి ఇతర రచనలు  

ముఖ్యమైన చర్చలు

  • దాశరథీ శతకము
  • దేశ భక్తి
  • కన్యాశుల్కము
More

CRTL గౌరవ సభ్యుల కవిత్వాలు

Pagination

  • First page « First
  • Previous page ‹ Previous
  • Page 1
  • Page 2
  • Page 3
  • Current page 4

మరిన్ని CRTL సభ్యుల కవిత్వాలు 

CRTL గౌరవ సభ్యుల రచనలు

చదువలేనె ఎలా ఎలా
మాధవరావు కోరుప్రోలు
గజల్
నీ మనసున చేరనిమ్ము
మాధవరావు కోరుప్రోలు
గజల్
ప్రేమలేఖ అవుతానా
మాధవరావు కోరుప్రోలు
గజల్
అక్షరముగా మిగిలిపోనీ
మాధవరావు కోరుప్రోలు
గజల్
మహరాణీ.
మాధవరావు కోరుప్రోలు
గజల్

Pagination

  • First page « First
  • Previous page ‹ Previous
  • …
  • Page 41
  • Page 42
  • Page 43
  • Page 44
  • Current page 45
  • Page 46
  • Page 47
  • Page 48
  • Page 49
  • …
  • Next page Next ›
  • Last page Last »

మరిన్ని CRTL సభ్యుల రచనలు 

Footer

  • CRTL
  • పేరును నమోదు
  • Contact CRTL
  • పోటీ - 2021

Copyright 2021 - CRTL All Rights Reserved - Developed by Ammoru Village Technologies Pvt Ltd, Amaravati

Developed & Designed by: Alaa Haddad