310..
పాలు చల్ల లమ్మబోవు.. బాలలార కనుడమ్మా..!
గోపాలుని కూడి యాడు.. బాలలార కనుడమ్మా..!
మనసు దిటవు చేసుకొనుడు..పాలు ఒలికి పోతున్నవి..!
పనిని మరచి పోబోకుడు..బాలలార కనుడమ్మా..!
కాడు వాడు మాయగాడు..మన వలపుల దొరయె వాడు..!
మనదు చూపు మరలనీడు..బాలలార కనుడమ్మా..!
వెన్నదొంగ కాడమ్మా..అన్ని పంచు వాడమ్మా..!
మనసు మనసు వేణువూదు..బాలలార కనుడమ్మా..!
గోకులమున చేరినాడు..లీలలెన్నొ చేసినాడు..!
నమ్మ వీలు కాని వాడు..బాలలార కనుడమ్మా..!
'మాధవు'డా..! అని తలచగ పనియె లేక ఏలినాడు..!
అందరి మది గెలిచినాడు..బాలలార కనుడమ్మా..!