318..
నీ ప్రేమ మత్తులో..గమ్మత్తు ఉంది కదా..!
నీ స్నేహ మధువులో..గమ్మత్తు ఉంది కదా..!
నన్ను నే మరచాను నిను చూస్తు కూర్చుండి..!
నీ చూపు లోతులో..గమ్మత్తు ఉంది కదా..!
మాటాగి పోయింది..మనసాగి పోయింది..!
నీ లేత నవ్వులో..గమ్మత్తు ఉంది కదా..!
నే మాయమైపోతి..నీ తలపు జలధిలో..!
నీ పట్ల వలపులో..గమ్మత్తు ఉంది కదా..!
నా 'నేను' అడవిలో..నను తప్పిపొనీవె..!
నీ పలకరింపులో..గమ్మత్తు ఉంది కదా..!
ఆ'రాధ నైతినా..'మాధవా'..నీ చెంత..!
నీ వేణు రవములో..గమ్మత్తు ఉంది కదా..!