Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

591..
జాబిలమ్మకు..జాజిమల్లెకు..బంధమేదో ఉంది నిజమే..!?
తెలుగుభాషకు..తేనెపట్టుకు..అందమేదో ఉంది నిజమే..!?
అక్షరాలా భువనమందున..ఆడిపాడుచు అలరించునే..!
పొగడచెట్టుకు..పొన్ననీడకు..పొంకమేదో ఉంది నిజమే..!?
నేల తడిసే వేళలందున..బీజబీజము పులకించునే..!
కాంతి పూలకు..వింత వానకు..గంధమేదో ఉంది నిజమే..!?
కన్నతల్లిని..జన్మభూమిని..తలచుకుంటే సౌఖ్యమేగా..!
లేతనవ్వుకు..లేగపరుగుకు..అందమేదో ఉంది నిజమే..!?
నిన్నకోసం వేదనెందుకు..ఆశనిరాశల వంతెనేల..?!
మనసు కలలకు..హంసనడలకు..నందమేదో ఉంది నిజమే..!?
జగన్నాటక సూత్రధారీ..ఓ 'ర'మాధవ'..చిత్రమేలే..!
కల్పతరులకు..కామితములకు..బృందమేదో ఉందినిజమే..!?

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

బంధమేదో ఉంది నిజమే
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.