Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

624..
నీ సిగలో మల్లెచెండు..నవ్వుతోంది..అల్లరిగా..!
నీ సొగసరి ఆ వాల్జడ..కదులుతోంది అల్లరిగా..!
నీ తలపుల జలధిలోన..ఏమి గనులు కొలువున్నవి..!?
చెప్ప'లేని నయగారం..ఒలుకుతోంది అల్లరిగా..!
చిలిపితనపు చిరునామా..నీ చూపున దాగుందా..!?
గుండె లయల చిత్రాలను..చూపుతోంది అల్లరిగా..!
కాలాలను కావ్యాలుగ..మలచునదే నీ వలపా..!?
మనసు కథల గంధాలను..చిమ్ముతోంది అల్లరిగా..!
ప్రాణశిల్ప నాట్యాలకు..భంగిమలను పోదిగేవా..!
కనురెప్పల కదలికలను..నిలుపుతోంది అల్లరిగా..!
ఆ'మాధవ' వేణురవపు..దారులలో నీ శ్వాసే..!
నిర్వేదపు విరహాగ్నిని..కాల్చుతోంది అల్లరిగా..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

నవ్వుతోంది..అల్లరిగా
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.