235..
ఊపిరులకు వేదమైన.. నీ హాసమె నా ఊయల..!!
హృదయ వేణు నాదమైన.. నీ హాసమె నా ఊయల..!!
ఎలకోయిల మనసు గళము ఏలుచున్నమహరాణీ..!!
కలహంసల వాసమైన.. నీ హాసమె నా ఊయల..!!
ఏ తారల భాష ఏమొ..వివరించే మృదు భాషిణి..!!
పాలపుంత భాసమైన.. నీ హాసమె నా ఊయల..!!
తలపు తలపు వలపు వీణ..తరుణములో మీటేవా..!!
ఊహ మాటు మౌనమైన.. నీ హాసమె నా ఊయల..!!
పరవశించు పరిమళాల పానశాల చేర్చేవా..!!
సరసభావ గానమైన.. నీ హాసమె నా ఊయల..!!
'మాధవు'డే పలకరింప..పులకరించు ఓ రాధా..!!
అమృత మధుర ధ్యానమైన.. నీ హాసమె నా ఊయల..!!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు