నెలవల సహజ
1/781,N.T.R.nagar, Srikalahasti.

     ఉపాధ్యాయులపైన నా ఉపన్యాసం

  రైతు దేశానికి వెన్నెముక అయినట్లే, ఉపాధ్యాయులే మానవ సమాజానికి వెన్నెముక అని నేనంటాను. ఎందుకంటే  రైతు ఎంతో కష్టపడి భూమిని దున్ని, విత్తనం నాటి దేశాన్ని పోషిస్తున్నాడు, అలాగే ఉపాధ్యాయులు కూడా విద్యార్థులలో జ్ఞానం అనే విత్తనం నాటి సమాజానికి ఉపయోగపడే వారిగా తీర్చిదిద్దుతారు. అయితే రైతు తాను వేసిన పంట కోసం మూడు నెలలు ఎదురుచూస్తే, ఉపాధ్యాయుడు మాత్రం తన విద్యార్థి విజయం కోసం కొన్ని సంవత్సరాలు ఎదురుచూస్తాడు. ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే విద్యార్థులలో జాతి, దేశభక్తి, దేశభద్రత, సమాజం పట్ల వారి బాధ్యతను బోధించి, వారి బోధనావిధానం ద్వారా విద్యార్థులు తమ నడత , ప్రవర్తనను సరిచూసుకునేలా వారిలో మంచి విలువలను నింపుతాడు.

మామూలుగా ఒక డ్రైవరు ఫెయిల్ అయితే ఆ బస్సులో ఉన్నవారికి మాత్రమే నష్టం కలుగుతుంది, ఒక డాక్టర్ ఫెయిల్ అయితే ఆ పేషంట్ నష్టపోతాడు, కానీ ఒక ఉపాధ్యాయుడు ఫెయిల్ అయితే సమాజమే నష్టపోతుంది . మనం ఏదైన తప్పు చేస్తే తల్లి కానీ, తండ్రి కానీ మందలిస్తారు ,ఎందుకంటే ఆ తప్పు మళ్ళీ చేయకూడదని . అలాగే ఉపాధ్యాయుడు కూడా మన భవిష్యత్తు బాగుండాలని ఒక దెబ్బకొడతాడు , అలా అని వారికి మనం అంటే కోపం కాదు. మన తల్లిదండ్రులు ఏ విధంగా మనమీద ప్రేమను కోపాన్ని చూపిస్తారో , అలాగే ఉపాధ్యాయులు కూడా మనలను ప్రేమించి మందలిస్తారు. కానీ అలా మందలించడం కూడా ప్రస్తుతకాలంలో నేరంగా మారిపోయింది. ఆ విషయం పక్కన పెడితే, ఒక తల్లి ఉదాహరణకు తన కూతురిని తీసుకుంటే , తన కూతురు అందంగా కనపడాలని కొత్తనగలు, కొత్త బట్టలు వేసి అందరిలో తన కూతురు అందంగా ఉండాలని కోరుకుంటుంది. అలాగే ఒక తండ్రి ఈ సమాజంలో ఎవరూ నా కూతురుని వేలుపెట్టి చుపించకూడదు  అని ,తన కూతురి నడతా, ప్రవర్తన ,పలానా వాళ్ల కూతురు చాలా మంచి అమ్మాయి అని అందరూ అనాలి అని తన కూతురి క్యారెక్టర్  అందంగా ఉండాలని కోరుకుంటాడు. వాళ్ళంటే మన రక్తసంబంధికులు కానీ ఎటువంటి రక్త సంబంధం లేకుండా భవిష్యత్తు అంతా అందంగా ఉండాలని కేవలం ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే కోరుకుంటాడు . ఇక్కడ చూసినట్లయితే తల్లి ఆశ మనపై కొంతకాలమే ఉంటుంది, తండ్రి ఆశ కూడా కొంతకాలమే ఉంటుంది ,కానీ ఉపాధ్యాయులు మాత్రం తమ విద్యార్థి గొప్పస్థాయిలో ఉండాలని తమ జీవితాంతం కోరుకుంటారు. తల్లి దండ్రులు ఇచ్చే ఆస్తి తరిగిపోతుంది, అయితే ఉపాధ్యాయులు ఇచ్చే విజ్ఞాన సంపద ఎప్పటికీ తరిగిపోదు. ఇలాంటి మంచి ఉపాధ్యాయులు దొరకడం నేను చాలా అదష్టంగా భావిస్తున్నాను . నేను వారికి ఏమి చేసినా కృతజ్ఞత తీర్చుకోలేను. అయితే భవిష్యత్తులో మాత్రం ఇదిగోండి మీరు వేసిన పంట మంచి పంటగా ఫలించిదని మనమందరం చెప్పాలన్నదే నా కోరిక. 

నెలవల సహజ,

చిత్తూరు జిల్లా.

 

ఉపాధ్యాయుల దినత్సవం
ఉపన్యాసాలు
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
1
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
1 votes with an average rating of 1.