అమ్మ గెలుస్తుంది by P అరుణ్ కుమార్ (CRTL కవితల పోటీ 2021)
P అరుణ్ కుమార్
అమ్మ గెలుస్తుంది
అంశం: వలస బ్రతుకులు
శీర్షిక:అమ్మ గెలుస్తుంది
సూరీడు మండుటెండగా తన ప్రతాపాన్ని చూపుతున్న మధ్యాహ్నవేళ...
బక్కపలుచని శరీరంతో....
ఆకలిని దిగమింగిన ..
కూడు దొరకని ఎముకలగూడుతో..
తన నడినెత్తిన బ్రతకాలనే బరువు ఆశను మోస్తూ...
తన చేతులలో ఆటాడుతున్న పిల్లల భవిష్యత్ ను చూస్తూ..
నిండు పున్నమి లో చుట్టూ అలుముకున్న అమావాస్య చీకటిలా ..
కరోనా అధిపత్యం చెలాయిస్తున్న అయోమయ ఆందోళన సందర్భంలో అడుగులు వేస్తూనే...
ఆక్సిజన్ సంకేతం తెలీని
ఓ అమ్మ అడుగుతోంది.. అందమైన ఈ ప్రకృతిని..!
ఇదేంటని...?
రేపు ఉంటుందా?
రేపటికి మనం వుంటామాఅని...?
కాలం కన్నెర్ర చేసిన ఈ పరిణామ విధ్వంసం లో..
వలస పక్షుల్లా...వలస జీవులమైన మాకు దారి కనపడుతూనే వుంది...!
కానీ గమనంలోని గమ్యమే అదృశ్యమవుతుందని..!
వైద్యుడు..దేవుడు ఎక్కడున్నాడో తెలీదు కానీ...
విలన్ గా నటించిన సోనూసూద్ హీరోరూపంలో మానవత్వమై బ్రతికుడున్నాడని.. ప్రకృతి అంటోంది..ఆ అమ్మతో..!
పాపం,పుణ్యం ప్రక్కనపెడితే...
పుట్టిన ఊరికి చేరేలోపే పాణం వుంటుందా అనే సంశయం ఓ ప్రక్క..!
లాక్ డౌన్ అర్థం కాక,
అన్నం దొరకక ..
కాలే కడుపులో సంగీతం పసిగట్టలేని ఆకలి స్వరాలు ఇంకో ప్రక్క..!
ఎలాగైనా జీవిత ఆటలో గెలవాలనే ఆరాటం..
విధి విసిరేసిన వింత నాటకంలో నిలవాలనే నిరంతర పోరాటంతో...
బ్రతుకు దెరువు కోసం బాటసారులై కదిలింది అమాయక ప్రజల
అమ్మల సైన్యం..!
వలస బ్రతుకులు కరోనాతో చేస్తున్న నిరంతర యుద్ధం..
అంతరాయం లేకుండా..
కొనసాగుతూనే వుంది.. ప్రభుత్వాల దయ దాక్షిణ్యాల మాయల మాటున...!!
ఏదేమైనా....
అమ్మ గెలుస్తుంది..!
పిల్లల్ని బ్రతికిస్తుంది..!
కరోనా ఏమి చేయలేక ఓడిపోతుంది..!
వలస జీవుల రాకతో పల్లెసీమలు మళ్ళీ చిరునవ్వులు చిందిస్తూ...
పట్టణాలను ఎగతాళి చేస్తూనే వుంటాయి...!!
మళ్ళీ మన అనుకునే పాతరోజులొచ్చాయని..!!
By P Arun Kumar
నాగర్ కర్నూల్
P.Arun kumar
Lecturer in Physics
STAR junior college
Nagarkurnool
Pin:509209
Phone:9394749536