*అంబేద్కర్ జయంతి*
అంబేద్కర్ పుట్టిన రోజట
పూలమాలలు, పాలాభిషేకాలట
ఉత్సవాలు,వేడుకలు, విందులట
జనాలకు తిరుగులేని ఉపన్యాసాలట
ఇలా జనాలకు ఎర వేయునట
ఇదంతా ఓట్ల కోసం రాజకీయవేట
గ్రహించక వేసినావో బ్రతుకు ముళ్ళబాట
రాసింది గొప్ప రాజ్యాంగమట
అది అమలులో పేరుకు మాత్రమేనట
మత స్వాతంత్ర్యపు హక్కట,
విదేశీ మతము ఉండకూడదట
భావప్రకటనస్వాతంత్ర్యపు హక్కట
భావాలను వ్యక్తపరిస్తే దేశద్రోహమట
రాజ్యాంగం అమలులో లేకే ఇన్ని తిప్పలట
అందుకోసం నీ పోరాటం అవసరమట
అమలైతే మన బతుకు పూలబాట
తరువాత కలుద్దాం ఇక సెలవట .