మంచి స్నేహితుడు
మంచి స్నేహితుడు
నాలోని లోపాల్ని ఎత్తి చూపి
తనలోని ధైర్యాన్ని నాలో నింపి,
నాలోని దురలవాట్లను రూపుమాపి
తనలోని సద్గుణాలను నాలో అలవరచి ,
నాలోని బలహీనతను గుర్తించి
తనలోని బలాన్ని నాలో పెంపొందించి,
నా పేదరికాన్ని లెక్క చేయక నాతో చెలిమి చేసి
తన కుటుంబంలో ఒక సభ్యునిగా ఎంచి,
నాలో మంచితనాన్ని అందరికి వెదజల్లి
తన లోకంలో నన్ను హీరోగా చేసుకున్న ఓ మిత్రమా ,
నిన్ను మరిచిపోవడం నా తరమా.
నెలవల సహజ,
చిత్తూరు జిల్లా.
లోకంలో మంచి స్నేహితుడూ ఉన్నాడు
మేలు చేయు స్నేహితుడు గాయము చేయును పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును
మోసపూరితమైన ఈ లోకంలో
మానవత్వం ఉండదనుకున్న ,
స్వార్థపూరితమైన ఈ సమాజంలో
సమాధాన పలకరింపు ఉండదనుకున్నా,
ద్రోహంతో నిండిన ఈ జగంలో
దాహం తీర్చే చేయి ఉండదనుకున్నా,
కపటంతో నిండిన ఈ ప్రపంచంలో
కమ్మని ఆదరణ దొరకదనుకున్నా,
ముద్దుపెట్టి కీడుచేసే పగవాల్లే ఉన్న ఈ విశ్వంలో
గాయపరిచి మేలు చేసే మిత్రుడు ఉన్నందుకు సంతోషిస్తున్నా.
మీ అందరికీ అలాంటి మిత్రుడు దొరకాలనుకుంటున్న .
నెలవల సహజ,
చిత్తూరు జిల్లా.
కపట స్నేహం
కపట స్నేహం
పొగుడుతూ ఉంటే- నా మనిషే అనుకున్నా
అభిమానాన్ని చూపిస్తుంటే - నాకు వీరాభిమాని అనుకున్నా
లెక్కలేనన్ని ముద్దులు పెడుతుంటే - అమితమైన ప్రేమ అనుకున్నా
అన్నీ కొనిస్తూ ఉంటే - మంచి మిత్రుడు అనుకున్నా
పైకి ప్రాణ స్నేహితుడు అని అంటుంటే - నిజమే అనుకున్నా
నాకు ప్రతి విషయంలో సలహాలు ఇస్తుంటే - అంతా నా అదృష్టం అనుకున్నా
నయవంచనతో నాకు వెన్నుపోటు పొడిచినా - తనకి మాత్రమే శత్రువు అనుకున్నా
కానీ ద్రోహిగా మారి అందరికీ నన్ను శత్రువును చేస్తుందని అస్సలు ఊహించానా
నడిచే నావే జీవితం
జీవితం ఒక నావ ప్రయాణం
గమ్యం చేరే దారిలో
అలలు, సుడిగుండాలు
అవాంతరాలై ఎదురు పడవచ్చు
సునామియే వచ్చి ముంచేయవచ్చు...
అలా అని భయపడి ప్రయాణం ఆపేస్తామా?
మనసే నీకు మార్గం చూపు దీపం
భయమనే ఈదురుగాలి
జ్ఞానమనే దీపాన్ని అర్పేస్తుంది!
అగమ్య గోచరమైన ప్రయాణంలో
అంధకారాన్ని నిర్మిస్తుంది!
ఒక్క క్షణం ఆలోచించు...
దారి లేదని మరణమే సరి అని
నిశ్చేష్టుడవ్వకు!
ఈదురుగాలిని తట్టుకొని
దీపాన్ని కొండెక్కనివ్వక
ధైర్యాన్ని సొమ్మసిల్లనవ్వక
పర స్త్రీ వ్యామోహంలో ముసిరిన చీకటి
పరస్త్రీ వ్యామోహంలో ముసిరిన చీకటి
ఆమె ముఖం జాబిలి
వెండివెలుగుల కోమలి
మత్తెక్కించే సొగసరి
మతిపోగొట్టే గడసరి!
అందని దూరాన ఉన్న ద్రాక్ష అది
అందుకే అంత అందం దానికి
మనసును కవ్విస్తుంది
మోహాన్ని రగిలిస్తుంది!
పొందితే చాలు జీవితం ధన్యం అనిపిస్తుంది
వెలుగునిచ్చే ఇంటి దీపం దిగదుడుపే అనిపిస్తుంది!
ఇల్లే ప్రపంచం అనుకునే గృహలక్ష్మి
పతియే ప్రత్యక్ష దైవంగా తలచి
సౌభాగ్యమే సౌందర్యం అనుకునే మహాసాధ్వి!
నీడలా వెంట ఉండే కల్పవృక్షమని మరిచి
చెరువు
శీర్షిక: చెరువు
మా ఊరి పెద్దమ్మ
పొలాల దాహార్తి తీర్చే గంగమ్మ
చాకలి రేవుగా మార్చినా
గోడ్లను కడిగే స్నానపు గదిగా చేసినా
అమ్మలా ఆదరిస్తుంది!
వెన్నెల వెలుగులో కలువల కన్నుల చేసి
పైరుగాలి తాకిడికి ఉయ్యాలూగుతూ
చిన్న చిన్న చేప పిల్లలతో
పరుగులు పెడుతూ సొగసులు అద్దుకొని
గలగలా నవ్వుతుంటుంది!
దాని ఒడే గర్భగుడి
మనసుకు హాయినిచ్చే మనస్విని
ఎన్నో అనుభవాలను అల్లర్లను
మూటకట్టుకున్న... మాఊరి ఆత్మే అది
ఊరు భారాన్ని మోసే భగీరధి!
నింగిలోకి చేరిన అనుబంధాలు
నవ్వుతూ కనిపించే వాట్స్అప్ డిపీలు
బోడిగా వెలవెలబోతున్నాయి
కలకలలాడే స్టేటస్లు
నిర్జీవంగా కనిపిస్తున్నాయి
ఆ నవ్వు ముఖం గుర్తొస్తే
గుండెల్లో తడి కళ్ళల్లో చేరుతున్నాయి
రోజు కనిపించిన నేస్తాలు
కనుమరుగై పోతుంటే...
ఆ తియ్యని పలకరింపు
మళ్లీ ఈ జన్మకు లేదని
గుర్తొస్తుంటే...
ఎవరో గొంతు నులిమేస్తున్నట్టు
ఈ గుండె కొట్టుకోవడానికి మొరాయిస్తుంది!
నాకు కూడా శాశ్వతం కాదు ప్రాణం
అన్నీ తెలిసిన ఆగటంలేదు కన్నీటి ప్రవాహం!
ఈ జన్మకు సెలవు అంటున్న బంధాలకు
తుది వీడ్కోలు పలకలేక
మత్తులో చితికిపోతున్న జీవితాలు
శీర్షిక: మత్తులో చితికిపోతున్న జీవితాలు!
నడిరోడ్డుపై పడిఉన్న దేహాలు
అన్నార్తులు శరణార్థులు కారు వీరు
మత్తుకు బానిసైన అభాగ్యులు
కష్టాల సుడిగుండంలో చిక్కి
బరువెక్కిన గుండెలకు
మత్తు అనే లేపనంతో
స్వాంతన కోరే భ్రమలో...
కడలంత కష్టం మింగేస్తుందని
ప్రేమ అనే మాయలో చిక్కుకున్నారని
మరుపు రాక మనసుని వంచించ లేక
గూడుకట్టుకున్న గుబులు దీపాని ఆర్పలని
దేహాన్ని కుళ్ళ బెట్టుకుంటున్నా పిరికివారు
వేదాంతాన్ని వల్లించే తత్వవేత్తలు!
తొలిచూపు
శీర్షిక: తొలి చూపు
తొలిపొద్దు మంచుదుప్పటిలో
విరిసిన మందారంలా
వేకువ కిరణం తగిలిన
మంచు బిందువై మెరిసింది!
చూపులతో గాళం వేసింది
మనసుకు మబ్బును చుట్టి
తన చీర కొంగుకి ముడి వేసింది !
గుండెలయ అదుపు తప్పి వేగం పెరిగింది
దాగుడుమూతలతో ఆమె చుట్టూ
ప్రదక్షిణ చేస్తుంది!
ఆమె చూపుల వర్షంలో
దేహం తడిసి ముద్దైంది!
వసంతాలను కుమ్మరించే చెట్టై
పువ్వుల నవ్వులను కురిపించింది!
తనను చూసే ప్రతిరోజు
తొలిచూపుగా నన్ను కవ్విస్తున్నది
చూపులలోని సరసం