321..
తేనె మేఘ మాలలెన్నొ..ఉన్నవిలే నీ నవ్వున..!
పసిడి కాంతి తారలెన్నొ..ఉన్నవిలే నీ నవ్వున..!
పరుగులిడే మయూరాల ఒడుపున్న ఓ చెలియా..!
లేత వలపు మమతలెన్నొ..ఉన్నవిలే నీ నవ్వున..!
కలల గగన వీధులలో విహరించే నిజ హంసా..!
కవ్వించే కవితలెన్నొ..ఉన్నవిలే నీ నవ్వున..!
చిత్రమైన కాన్వాసుగ మారినావు నాకోసం..
రేకు విడని మొగ్గలెన్నొ..ఉన్నవిలే నీ నవ్వున..!
పరిమళించు రాగ సిరుల మందారం నీవేలే..!
ప్రేమ సుధల లేఖలెన్నొ..ఉన్నవిలే నీ నవ్వున..!
'మాధవు'నకు తెలుసుకదా..నీ సాధన ఓ రాధా..!
ఆ'రాధన జాడలెన్నొ..ఉన్నవిలే నీ నవ్వున..!