322..
నీ నవ్వుల దారులలో.. ఆడుతు..నే ఉండాలీ..!
నీ చూపుల వీధులలో.. ఆడుతు..నే ఉండాలీ..!
పుణ్యమెంత చేసానో..ఈ వసంత వేళలకై..
నీ వెన్నెల మడుగులలో..ఆడుతు..నే ఉండాలీ..!
అక్షరాల వేణువులా..పాడుతోంది నా హృదయం..!
నీ తలపుల మబ్బులలో..ఆడుతు..నే ఉండాలీ..!
కల్పవృక్ష మెలావుండునో ఏమో తెలియదుగా..
నీ పలుకుల కాంతులలో..ఆడుతు..నే ఉండాలీ..!
మౌనవీణ చేసినావు..నా మనసును ఓ సఖుడా..!
నీ తియ్యని స్వరములలో..ఆడుతు..నే ఉండాలీ..!
మాధవుడా..నీ దయతో కదులుతున్న ఆ'రాధను..!
నీ బంగరు ముగ్గులలో..ఆడుతు..నే ఉండాలీ..!