206..
గిరి మల్లెలు ఎందుకులే..నీ నవ్వులు కురియు వేళ..!!
సంపెంగలు ఎందుకులే..నీ సొగసులు మురియు వేళ..!!
నీ తియ్యని పలకరింపు పరిమళమది తెలుపుటెలా..!?
గులాబీలు ఎందుకులే..నీ చూపులు విరియు వేళ..!!
ఎడారిలో ఒయాసిస్సు దొరికినదే నా మనసుకు..!!
ఖజూరాలు ఎందుకులే..నీ వలపులు ముసురు వేళ..!!
ఆ చుక్కల తోటలోన నిలిపినావు నా తలపును..!!
వసంతాలు ఎందుకులే..నీ అలుకలు విసురు వేళ..!!
ఏ పూవులు తెంపలేను..నా ప్రేమకు సాక్ష్యముగా..!!
ఆ సిగ్గులు ఎందుకులే..నీ ఆశలు మరుగు వేళ..!!
'మాధవు'డా..! భక్తి పూలు కోరి మరీ గైకొనునే..!!
పై మెరుగులు ఎందుకులే..నీ వెలుగులు చిలుకు వేళ..!!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు