329..
నీ చూపుల దారంతా.. మధుమాసపు.. వెన్నెలలే..!
నా తలపుల కోవెలలో.. మరులు నింపు.. వెన్నెలలే..!
మాటలేల సరిపోవును..నీ మౌన రాగాలకు..
నీ అడుగుల జాడలలో..లేత వలపు.. వెన్నెలలే..!
శుకపికములు సాక్షులుగా.. ప్రణయ వీణ స్వరములకు..!
నీ నవ్వుల జల్లులలో..మైత్రి కురియు.. వెన్నెలలే..!
నులి వెచ్చని నీ స్పర్శకు..అణువణువున పులకింతే..!
నా వెంటే నీవుంటే..సొగసు నిండు..వెన్నెలలే..!
రాత్రులెన్ని గడిచినవో..పగటిధ్యాస ఉంటేగా..!
కల హంసల ఊహలలో.. బ్రతుకు పండు.. వెన్నెలలే..!?
'మాధవు'డా నీ పదముల చేరేందుకు ముచ్చ టాయె..!
నీ తియ్యని బృందావని..పలకరించు వెన్నెలలే..!