332..
విరహాలకు వీడుకోలు..అందామోయ్..సరదాగా..!
కాలాలకు అతీతమై..ఉందామోయ్..సరదాగా..!
చిలిపి పూల తోటలలో..కలహించుట మధురములే..!
వలపు తేనె మోహాలను..కందామోయ్..సరదాగా..!
మౌన గగన వీధులలో..కలహంసలు మనమేగా..!
పాల పుంత రాగాలను..విందామోయ్..సరదాగా..!
అల్లుకునే కాంతి లతల..అల్లరులవి మనోహరం..!
అవి పెట్టే ఫలములనే..తిందామోయ్..సరదాగా..!
అలసటలకు తావులేని..స్వర్గమొకటి ఉన్నదిలే..!
బరువు లేని పరవశాలు..మోద్దామోయ్..సరదాగా..!
ఆ రాధా 'మాధవు'లకు..బృందావని సాక్షి కదా..!
మన కలయిక కరగనిదే..దాద్దామొయ్..సరదాగా..!