333..
దోసె ఆశ మాడిపోయె.. ఉల్లి పాయ ధరను చూసి..!
ఆలు కర్రి అలిగిపోయె.. ఉల్లి పాయ ధరను చూసి..!
వాన తల్లి రాకపాయె..రైతు బాధ తీరదాయె..!
పేద పేగు నలిగిపోయె..ఉల్లి పాయ ధరను చూసి..!
వంకాయ..గోంగూర..పాలకూర కరువాయె నీరు లేక..!
కంట నీరు ఇగిరిపోయె..ఉల్లి పాయ ధరను చూసి..!
ఉప్పు కూడ ధర హెచ్చెను..మబ్బు జాడ లే నందుకె..!
ఆరు రుచులు ఎగిరిపోయె..ఉల్లి పాయ ధరను చూసి..!
పెరుగు చట్ని గొడవ చూడు..ఉల్లి చెలియ తోడు కొరకు..!
బిర్యానీ బిగిసిపోయె..ఉల్లి పాయ ధరను చూసి..!
'మాధవు'నకు చెప్పలేక..రాధ మౌన మాయెనహో..!
ఈ భువియే..మసలిపోయె..ఉల్లి పాయ ధరను చూసి..!