338.
వాదన తోనే.. వేదన చూడూ..!
శోధన తోనే.. సాధన చూడూ..!
ఎదలోలోపల బాధది ఎందుకు..?!
మరుగుటతోనే..రోదన చూడూ..!
రాలే పువ్వుల నవ్వులు తెలుసా..?!
ఎగిరే తేనెల..వానన చూడూ..!
మూసగ మారిన..బ్రతుకది ఏలా..?!
వీడని జన్మల.. భావన చూడూ..!
కలగా మిగిలిన.. కథనే మార్చగ..
హంసల సాక్షీ..ధ్యాసన చూడూ..!
తనువను వేణువు..'మాధవ' సొంతము..!
మనసే మధువది..తియ్యన చూడూ..!