343..
హంస గీతి వీధులలో..మెరుపు పాట నీవేగా..!
కాంతి లతల తలపులలో..వలపు వాన నీవేగా..!
నా స్వరమున శృతి లయలకు..ప్రాణమూదు ప్రియ సఖియా..!
ఎద గులాబి వనములలో..ముసురు ప్రేమ నీవేగా..!
కలల పంట వరమొసగే.. మౌన రాణి చిరునగవై..
నా నిద్దుర మెలకువలో..అడుగు జాడ నీవేగా..!
పదపదమున మారుమ్రోగు నాదాలకు వేదికవే..!
అధరాలకు అరుణిమలో..వెలుగు నీడ నీవేగా..!
కనుసైగల-కనుబొమ్మల..కథలు తెల్పు నెరజాణా..!
అనురాగపు కోవెలలో..ముద్దు గుమ్మ నీవేగా..!
ఆ మాధవ బృందావన సీమామణి హారమీవు..!
నా పలుకుల వెన్నెలలో నిండు ధార నీవేగా..!