Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

376..
కోటి వర్ణ ఇంద్ర ధనువు.. విరిసెనులే..నీ నవ్వున..!
పసిడి పూల కల్పతరువు..వెలిగెనులే..నీ నవ్వున..!
ఆ మబ్బులు.. ఈ కొండలు..నీ పాటల కోవెలలే..!
సిరి మువ్వల నాద మధువు..పొంగెనులే..నీ నవ్వున..!
పంట చేల పైరగాలి..వేయు ఈల కేమి తెలుసు..?!
సెలయేరుల నిండు కొలువు..దాగెనులే..నీ నవ్వున..!
పాల పుంత మౌనమాయె..నీ సొగసుల రాగాలకు..!
కాల వీణ వలపు బరువు..ఒదిగెనులే..నీ నవ్వున..!
స్వప్నగగన సౌందర్యము..తెల్లబోయె..ఓ సఖియా..!
స్నేహగీతి గుండె దరువు..నిండెనులే..నీ నవ్వున..!
'మాధవు'నకు ప్రాణమైన..నవ కోమలి నీవు కదా..!
పలుకు హంస తలపు గురువు..నిలచెనులే..నీ నవ్వున..!

.నీ నవ్వున..!
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.