349..
నీ కంకణ వజ్రములా..నను బందీ..చేసినావె..!
నీ మెడలో హారములా..నను బందీ..చేసినావె..!
నీ కన్నుల మెరుపులలో..వెలుగు నదిని నేనేనా..!
నీ శిఖలో పింఛములా..నను బందీ..చేసినావె..!
నీ నుదుటి కస్తూరిగ..మిగలాలని వేడుకాయె..!
నీ పెదవుల హాసములా..నను బందీ..చేసినావె..!
బృందావని వెన్నెలగా..ఏల నన్ను నిలిపినావొ..!?
నీ తలపుల దీపములా..నను బందీ..చేసినావె..!
శుక పికములు సాక్షులవగ..ఆ తారల కొలువు లోన..!
నీ వలపుల శిల్పములా..నను బందీ..చేసినావె..!
ఓ'మాధవ' ఈ రాధను..ఆ యమునకు నెచ్చెలిగా..
నీ అడుగుల కల్పములా..నను బందీ..చేసినావె..!