353..
చిగురుటాకు ఎద ఎదలో.. పొంగు పాటఎవ్వరిదో..!?
గింజ గుండె లయ లయలో.. మ్రోగు పాటఎవ్వరిదో..!?
మోయలేని విరహమెచట ఉన్నదోయి చెలికాడా..!
తలపు మాటు వెన్నెలలో..కురియు పాటఎవ్వరిదో..!?
తోడు కొరకు వెతుకులాట మానుకొనుట తెలియాలోయ్..!
నీడ పడని దారులలో..వెలుగు పాటఎవ్వరిదో..!?
మంచు పూల పరిమళాలు ఏ మనసుకు అందెనోయ్..!?
ఇంద్రధనువు అందెలలో..విరియు పాటఎవ్వరిదో..!?
మధుర ప్రణయ సుధా రాశి రాధమ్మకు చెప్పాలా..!?
బృందావని వలపులలో..ఒలుకు పాటఎవ్వరిదో..!?
యమునాతటి విహరించే రాధెవరోయ్ 'మాధవు'డా..?!
మరుల వేణు రవములలో..ఒలుకు పాటఎవ్వరిదో..!?