366..
ఎందుకింత తాపమోయి.. తీర్చు వాన రాదేలా..?!
చెలుని జాడ ఎచటనోయి..చూపు వాన రాదేలా..!?
ఎచట నీవు ఉన్నావో..తెలియుటెలా..ప్రియ సఖుడా..!?
విరహమెపుడు వీడునోయి..కలుపు వాన రాదేలా..!?
తోటలెన్ని తిరిగానో లెక్క లేదు..చెప్పలేను..!
సౌఖ్యమేల ఉండునోయి..తెలుపు వాన రాదేలా..!?
మనసులోని వేదనలకు అంత మెపుడొ తొచదాయె..!!
కలలు ఎపుడు పండునోయి..పలుకు వాన రాదేలా..!?
తనువు తడిసిపోతున్నా..హాయి ఏల కరువాయే..!?
ఆవేదన అడిగెనోయి..ముంచు వాన రాదేలా..!?
'మాధవు'డా..! నీవుంటే.. నన్ను చేర దయ లేదా..!?
మూసినాను కన్నుదోయి..దోచు వాన రాదేలా..!?