374..
నన్ను నీవు ప్రేమించావనుకున్నా..తెలియక' నే..!
నిన్ను నేను ప్రేమించాననుకున్నా..తెలియక' నే..!
నీవెవరో.. నేనెవరో..విడివిడిగా ఉన్నామా ఎపుడైనా..!?
నీ కొరకే దుఃఖించాననుకున్నా.. తెలియక' నే..!
రాలుతున్న పూలనడుగు ఓ చెలియా బాధంటే..!
నీ మనసును మురిపించాననుకున్నా..తెలియక' నే..!
చల్ల గాలి కేమితెలుసు పలకరించుటేలాగో..?!
నీ వలపులు వెలిగించాననుకున్నా..తెలియక' నే..!
మంచు పూల మధువుల రుచి చూడలేదు కలనైనా..!
నీ తలపులు పలికించాననుకున్నా..తెలియక' నే..!
బృందావన సీమనేలు 'మాధవు'నకు ప్రియ సఖియా..!
నీ శ్వాసను పండించాననుకున్నా..తెలియక' నే..!