375..
మధురాపురి దారేదో చూపే..'వా..మనోహరీ..!
మనసులోని కలలన్నీ తీర్చే..'వా..మనోహరీ..!
పరుగులిడే నీలిమబ్బు హృదయానికి నెచ్చెలివా..!
కలవరించు మెరుపు తలపు నిలిపే..'వా..మనోహరీ..!
పలుకు చినుకు తేనియలకు..మూలమైన ప్రియ సఖియా..!
ఎద మీటే..మౌనాలను కురిసే..'వా..మనోహరీ..!
నీ తియ్యని వలపులలో..ఎన్ని కాంతి పూల నిధులొ..?!
సుస్వరాల పరిమళాలు అలదే..'వా.మనోహరీ..!
విరహాలను అధిగమించు శక్తినొసగు..సరసాంగీ..!
నిద్దురలో మెలకువయై..వెలిగే..'వా..మనోహరీ..!
'మాధవు'నకు ఆ'రాధాగ విందులెన్ని చేసేవో..?!
నా మదిలో వెన్నెలగా..మిగిలే..'వా..మనోహరీ..!