గజల్ 3795.
"అమావాస్య"లాగ ఎలా..మారిందో పట్టపగలు..!
రామచిలుక 'మనసు' ఎలా..చెదిరిందో పట్టపగలు..!
పరిమళించలేని తనం..చుట్టేసెను గాలులనే..
ఈ-చదువుల తీరు ఎలా..ఆగిందో పట్టపగలు..!
ప్రేమకథా సాగరమే..కల్లోలము పాలయ్యెనె..
చిత్రమైన వలపు ఎలా..మరిగిందో పట్టపగలు..!
చెలిమికింత వెలకట్టే..గుణమదెంత వెర్రితనం..
భంగపడిన డాలరెలా..కుంగిందో పట్టపగలు..!
మాస్కులేక బ్రతుకలేని..కాలమెంత విచిత్రమో..
చేసుకున్న పాపమెలా..పండిందో పట్టపగలు..!
నరునికన్న వానరుడే..మిన్నకదా మాధవుడా..
మానవత్వమెపుడు బట్ట..కట్టిందో పట్టపగలు..!