గజల్ 3664.
కలనైనా కర్తవ్యం..మరువకున్న వాడె ప్రభువు..!
ప్రజాక్షేమమను లక్ష్యం..కాచుకున్న వాడె ప్రభువు..!
పులుగడిగిన ముత్యంలా..వ్యక్తిత్వం ఉందెవరికి..
గురుశక్తికి అంకితమై..నిలుపుకున్న వాడె ప్రభువు..!
కణకణమున దైవత్వం..ఉట్టిపడే మోమెవరిది..
కరుణాద్భుత మేఘమల్లె..నడచుకున్న వాడె ప్రభువు..!
కఠినత్వం ఎంతున్నా..శాసనాల వరకే మరి..
మౌనం తన సంపదగా..తెలుసుకున్న వాడె ప్రభువు..!
వ్యూహాత్మక సౌందర్యం..అప్రకటిత సౌశీల్యం..
మాటలన్ని చేతలుగా..మలచుకున్న వాడె ప్రభువు..!
మాధవుడా ఈ "మోదీ"..విశ్వానికి ఆదర్శం..
తనను తాను నిజశ్వాసగ..దాచుకున్న వాడె ప్రభువు..!