గజల్ 3650.
చూసికూడా చూడనట్లే..వెళ్ళిపోవుట మంచిదే..!
తెలిసికూడా తెలియనట్లే..ఉండిపోవుట మంచిదే..!
పత్రిపూవులు పండ్లనిస్తూ..ఇన్ని ఇచ్చానన్నదా..
ఇచ్చికూడా ఇవ్వనట్లే..ఇచ్చిపోవుట మంచిదే..!
చినుకుచినుకుకు పులకరిస్తూ..మౌనరుషిలా ఉన్నదా..
తడిసికూడా తడవనట్లుగ..తడిసిపోతే మంచిదే..!
వసంతాలు సాక్షిలాగా..నిలచుతీరే తెలియదా..
కదిలికూడా కదలనట్లుగ..కదిలిపోతే మంచిదే..!
కొమ్మలందున చివురులేవో..మేసిమేయని కోకిలై..
పాడికూడా పాడనట్లుగ..పాడిపోతే మంచిదే..!
ఎవరికేమిటి చెప్పగలవో..బాధ ఎందుకు మాధవా..
చెప్పికూడా చెప్పనట్లుగ..చెప్పిపోతే మంచిదే..!
మబ్బుకురిసే సందడేదో..తెలిసిపరవశమందునే..
ఆడికూడా ఆడనట్లుగ..ఆడిపోతే మంచిదే..!