383..
తీరంతో..అలల ముద్దులాటేగా..సంసారం..!
మనస్సుతో..కలల పొద్దులాటేగా..సంసారం..!
గొడవెందుకు మెలకువతో..ఓ చెలియా తెలుపవేల..!
ఆశలతో..మరపుసుద్దులాటేగా..సంసారం..!
రథమేదో..ఎదుట నిలచె..మనోరథము లేలేందుకు..!
తాపాలకు వలపు హద్దులాటేగా..సంసారం..!
ప్రతి మానస కాసారం..తెలి హంసల లోకానే..!
మౌనాలకు తోడు పద్దులాటేగా..సంసారం..!
మెరుపు వీణ తంత్రులపై..ప్రవహించే పాట మాటు..
చిలిపి ఎదల తలపురద్దులాటేగా..సంసారం..!
ప్రణయ వేణు రవములలో..ఆ'మాధవ' నగవు సాక్షి..
అర పెదవుల..తరుము సద్దులాటేగా..సంసారం..!