385..
నిదుర పక్షి గమనించక.. కలలు తీరిపోయేనా..?!
అగ్ని పూలు వర్షించక..అలలు ఇగిరిపోయేనా..?!
ఆరాటపు జలధికసలు.. తీర మెక్కడుందోయీ..?!
మనస్సాక్షి కనిపించక..తెరలు తొలగిపోయేనా..!?
మంత్రాక్షర పుష్పాలకు..పరిమళించు అహం చూడు..!
కర్మ ముసుగు విదిలించక..వలలు చెదిరి పోయేనా..?!
మౌన వీణ రాగాలను..ఆలపించు స్వర మెవరిది..!?
విసుగు పట్టు విసిగించక..మలలు కరిగి పోయేనా..?!
ఆ''మాధవ'' తత్వానికి..అద్దమంటి మిత్రులార..!
సమ దృష్టిని వీక్షించక..తలలు పండి పోయేనా..!?