394..
అందరిలో ఉన్న జ్యోతి వెలుగుతోంది..ఒకే రీతి..!
మైత్రి సుధలు పంచేందుకు కదులుతోంది..ఒకే రీతి..!
సహనంతో అడుగు వేయు మనుషు లెంద రున్నారని..
నిదానంగ గమనిస్తూ వెదుకుతోంది..ఒకే రీతి..!
మౌనానికి అంకితమై రంగులెన్నొ వర్షించగ..
మూల శక్తి నిధి తానై..నడుపుతోంది..ఒకే రీతి..!
పాల కడలి పన్నగమున పవళించిన దెవరోయీ..?!
మాయ కసలు అంటకుండ..ఆడుతోంది..ఒకే రీతి..!
అణువణువున కొలువు తీరి..అలరిస్తూ ఉన్నదోయి..!
ప్రాణాలకు ప్రాణమౌతు..ఒదుగుతోంది..ఒకే రీతి..!
'మాధవు'నకు ఆ'రాధకు నడుమ సాక్షి విశ్వమదే..!
బృందావన పరిమళాల..నిండుతోంది..ఒకే రీతి..!