Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

396..
ప్రాణానికి ప్రాణమువే.. నిన్ను మరచి ఉండుటెలా..?!
కలనైనా నా తోడువె..నిన్ను విడచి బ్రతుకుటెలా..!?
కోరికేమి లేదు గాని..నీకు నేను ఏమౌతా..!
మనసు గోడు ఏమో మరి..నోరు తెరచి అడుగుటెలా..!?
నా పలుకుల నేలు చిలుక నీవేనని అనిపించెను..!
నువు మీటక శ్వాసించని..గుండె గుడిని నిలచుటెలా..?!
ఈ ప్రశ్నల మబ్బులలో..నన్నెందుకు వదిలేశావ్..!?
నా కవితల నువు నిండక..మైత్రి నిధిని కాచుటెలా..?!
లేని ఆశ పుట్టదులే..నీ వెన్నెల మడుగు చాలు..!
నీ చల్లని కనుసన్నల..నా లేఖని చేర్చుటెలా..?!
'మాధవు'నకు విన్నపాలు..సమర్పింతు..ధ్యాన సాక్షి..!
నీ తియ్యని పాట వినక..'ప్రేమ' జగతి నేలుటెలా..?!

విడచి బ్రతుకుటెలా..!?
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.