408..
వెన్నెలమ్మను గిచ్చుకుంటూ పాటలెందుకు పాడుతావో..!?
మబ్బుకన్నెను మెచ్చుకుంటూ ఆటలెందుకు ఆడుతావో..!?
ప్రేమ అంటే..ఆశ పడుతూ ఉరుకులాడే సంగతవదే..!
చంద్ర వంకను..తిట్టుకుంటూ..అసలు ఎందుకు అలుగుతావో..!?
మనసు గొడవను మాన్పుకొనగా మార్గమేదో పట్టకుండా..
తీపి కలలను తలచుకుంటూ..దిగులు ఎందుకు..చెందుతావో..?!
అద్ద మొక్కటి ఎదురుగున్నా..చూసుకోవే తేరిపారా..!
పూల పల్లకి చూసుకుంటూ..తలపులెందుకు..పిండుతావో..!?
విరహగీతము లాలపిస్తూ..కాలయాపన లేలనోయీ..!?
వసంతాలను జార్చుకుంటూ..వలపులెందుకు..కాల్చుతావో..!?
వేణు 'మాధవ' గానమందున మునుగజాలాక తొలగ దలసట..!
బ్రతుకు పందిరి నల్లుకుంటూ..చిక్కులెందుకు..పొందుతావో..!?
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు