421..
నీ తలపే మధువైనది - నన్ను కాల్చు జ్వాలైనది..!
నీ చూపే వెలుగైనది - నన్ను నడుపు పాటైనది..!
మాట మాటు మౌననిధులు రక్షించే మహరాణీ..!
నీ సొగసే పలుకైనది - నన్ను తడుపు వానైనది..!
చినుకు ఎదను మీటుచున్న వాయులీన మనోహరీ..!
నీ వలపే వనమైనది - నన్ను నిలుపు జాణైనది..!
అణువణువును ఏలుచున్న స్నేహారాగ సుమవర్షిణి..!
నీ పిలుపే మెరుపైనది - నన్ను వలచు మొగ్గైనది..!
ఇంద్రచాప వర్ణాలకు గొడుగు పట్టు నవ మోహిని..!
నీ ఊసే తనువైనది - నన్ను మలచు శ్వాసైనది..!
'మాధవు'నకు.. ఏ పూవులు - ఏ వేళకు అర్పింతువొ..?!
నీ స్వరమే తోడైనది - నన్ను కాచు నీడైనది..!!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు