427..
ఈ ఒంటరితనమేమో - విరహగీత మౌతున్నది..!
నీ తుంటరితనమేమో - మధురరాగ మౌతున్నది..!
నిన్ను చూచు ముచ్చటలో..నా నేనది ఏమాయెనొ..!?
అక్షరాల కడలేమో - ప్రణయగాన మౌతున్నది..!
నా మానస సరోవరము - నీ వెలుగుల కాసారము..!
కలహంసల నగవేమో - మోహనాద మౌతున్నది..!
ఎవరికెవరు సాక్షి చూడ - విశ్వమైత్రి గగనమ్మున..!
భవసాగర వలపేమో - ప్రేమభావ మౌతున్నది..!
అంతులేని ఏకాంతపు - వెంనేలేపుడు దొరికేనో..?!
నీ తియ్యని చూపేమో - మౌన ధ్యాన మౌతున్నది..!
నవ మోహన 'మాధవు'నకు - ఆ'రాధాగ మారాలని..
బృందావన శ్వాసేమో - నిత్య స'రస మౌతున్నది..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు