430..
అలసటసలు దరి చేరదు - నీకోసం చూస్తుంటే..!
దాహమసలు వేదించదు - నీ కోసం చూస్తుంటే..!
నీ సన్నిధి వాలేందుకు ఆరాటం లేదు ప్రియా..!
విరహమసలు విసిగించదు - నీ కోసం చూస్తుంటే..!
చిత్రమైన కలలెన్నో వింత హాయి ఎద నింపును..!
ఆకలసలు అనిపించదు - నీ కోసం చూస్తుంటే..!
మధురమైన మత్తు ఎదో చిత్తమునే కమ్ముకొనును..!
తాపమసలు తనువంటదు - నీ కోసం చూస్తుంటే..!
నీదు చెలిమి పరిమళమది మౌనగగన సోయగమే..!
నిద్దురసలు రెప్పంటదు - నీ కోసం చూస్తుంటే..!
'మాధవు'డా..! నీవే నా ప్రియసఖుడవు ప్రతి జన్మకు..!
ప్రాణమసలు లయ మరువదు - నీ కోసం చూస్తుంటే..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు