434..
నీ ఎదపై గులాబినై - వాలాలని ఉంది సఖా..!
నీ మదిలో వెన్నెలనై - నిండాలని ఉంది సఖా..!
దీపావళి వచ్చెనుగా - నీ తియ్యని నవ్వులతో..!
నీ కవితల పరిమళమై - బ్రతకాలని ఉంది సఖా..!
ప్రేమలేఖ వ్రాసేందుకు - మాటలేల కరువౌనో..!
నీ చెలిమికి అద్దమునై - నిలవాలని ఉంది సఖా..!
నా మౌనము మీటుతున్న- నీ చూపుకు గులామునే..!
నీ పాటకు పల్లవినై - ఒదగాలని ఉంది సఖా..!
రాయంచల పదసీమల - విహరించగ తోడౌదువె..!
నీ తలపుల గగనమునై - మిగలాలని ఉంది సఖా..!
ఆ 'మాధవ' బృందావని - మనకొరకే..అని తెలిసెను..!
నీ వలపుల మధువనినై - విరియాలని ఉంది సఖా..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు