Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

571..
ఎప్పుడు మొదలయ్యిందో..అందమైన..నుమాయిషీ..!?
చెప్ప'లేని గంధాలకు..బంధమైన..నుమాయిషీ..!?
ఎన్ని కళలు..ఎన్నిరంగు లెన్ని సొగసు లీజగమున..!
పెదవి చివరి దరహాసపు..చిత్రమైన..నుమాయిషీ..!?
బహు'మతులకు ప్రతిమతి ఒక కోవెలయే..గమనిస్తే..!
మాయ మనసు ఆటలతో..లోకమైన..నుమాయిషీ..!?
విశ్వమునే గెలవాలని వైజ్ఞానిక ఆవేశం..!
గగనాలను దాటేందుకు..గగనమైన..నుమాయిషీ..!?
ఆధిపత్య పోరాటపు ప్రపంచాన్ని ఏమంటాం..?!
అడుగడుగున అనుక్షణం..యుద్ధమైన నుమాయిషీ..!
అర్జునునకు గీతబోధ చేసినవో 'మాధవు'డా..!
విశ్వరూప సందర్శన..భాగ్యమైన నుమాయిషీ..!?

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు

.అందమైన..నుమాయిషీ
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.