464
రేటు సంగతి కేమి గానీ - రుచులు ఎన్నోకంది పప్పున ..!!
భువిని చూడగ చెప్పలేనీ - వ్యథలు ఎన్నో రైతు బ్రతుకున..!?
గొడ్డుకారపు మెతుకుకైనా - నోచుకోనీ వారు ఎందరొ..?!
సాంబారను మాట విననీ - కథలు ఎన్నో పేదరికమున..!?
పచ్చి దోపిడి వేపుడైతే - దోషమెవరిదొ ఎంచనేలా..!?
జీతమెంతో ఏమొగానీ - కలలు ఎన్నో మనిషి మనసున..?!
వాన మబ్బుల జాడ కరువై - బీటవారిన పుడమి గొంతును..
తడుపు యజ్ఞము చేయలేనీ - తలలు ఎన్నో వెర్రి జగమున..?!
వలస పోయే ప్రాణి కోట్లే - దిక్కు తోచక రాలిపోతే..
అడుగు ముందుకు వేయలేనీ - ఇరులు ఎన్నో తలపు తలపున..!?
ఓరి 'మాధవ'.. కులుకనేలా - రాధ కూడీ యమున ఒడ్డున..?!
వేణు గానము మోయలేనీ - విరులు ఎన్నో వలపు వలపున..?!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు