466..
నా తలపుల దీపాలకు రూపమిచ్చు మహరాణీ..!
నా ఆశల శిల్పాలకు శ్వాసనిచ్చు మహరాణీ..!
నీవు లేక ఒక్క క్షణం మనలేనని తెలిసె నేడు..!
నా వలపుల రాగాలకు భోగమిచ్చు మహరాణీ..!
నీ నవ్వే పారిజాత వర్షంలా కురియునుగా..!
నా చూపుల నాదాలకు సౌఖ్యమిచ్చు మహరాణీ..!
నీ కన్నుల వాకిట నే వేచినాను జన్మలుగా..!
నా పలుకుల మౌనాలకు సాక్ష్యమిచ్చు మహరాణీ..!
ఈ వసంత వనసీమన పరిమళించు వెన్నెలవే..!
ఆ మబ్బుల పాదాలకు శాంతమిచ్చు మహరాణీ..!
'మాధవు'నకు ఆ'రాధవు నీవేనా..చెప్పవేమి..!?
నా ప్రశ్నల పరువాలకు పర్వమిచ్చు మహరాణీ..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు