467..
@ గ్రేట్ మాస్టర్ Rambabu Challa గారికి ధన్యవాదములతో..
నీవు వ్రాసిన ప్రేమలేఖన - అక్షరముగా మిగిలిపోనీ..!
నీకు వ్రాయని ప్రేమలేఖన - అక్షయముగా మిగిలిపోనీ..!
గుండె తడిలో ఉన్నదేమో - తెలుపతరమే మాటలందున..!
నిన్ను చూడని రాత్రి సరసన - సుమశరముగా మిగిలిపోనీ..!
కంటి గుడిలో వెలుగు దివ్వెకు - తోడుసంతక మెవరిదో..?!
కనగ దొరకని పూలవానన - సురభిళముగా మిగిలిపోనీ..!
భావ ధారను పట్టి కుదిపే - ఇంద్రధనువుల మాల నీవు..!
పట్టు చిక్కని పదము ఎదన - నవరవముగా మిగిలిపోనీ..!
గాయమేదో..గంధమేదో - తెలియజాలని బ్రతుకు నాది..!
వెతల దారిని వెతుకులాటన - కలరవముగా మిగిలిపోనీ..!
ఓరి 'మాధవ'..! వేడుకేలా - నన్ను చూస్తే..రాధనైతిని..!
నీవు కురవని సాక్షి సాధన - పరవశముగా మిగిలిపోనీ..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు