470..
కన్నులెదుటి అక్షరాలె చదువలేనె ఎలా ఎలా..!?
నీ వలపుల వీణ హృదినె మీటలేనె ఎలా ఎలా ..?!
నేస్తమైన విరహానికి వేడుకాయె నా తోడే..!
కరిగిపోని కలల పాట వ్రాయలేనె ఎలా ఎలా..?!
చిత్తరువై కవ్వించే కల్పలతవు నీవేగా..!
నా లేఖల పసిడి మూట ఇవ్వలేనె ఎలా ఎలా.. ?!
పరువాలకు వేదికైన ఈ మనసే నీదాయే..!
తలపు ఇంద్రధనువులాట చూపలేనె ఎలా ఎలా..?!
నివురేదో..నిప్పేదో.. తెలియలేని కలువనురా..!
చెలువమైన శ్వాస ఊట ఆపలేనె ఎలా ఎలా..?!
ఓ 'మాధవ' నీ రాధను గడుసరినే అవజాలను..!
చెరసాలగ చిలుక కోట తలచలేనె ఎలా ఎలా..?!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు