471..
అందముగా జీవించే - కళ నేర్వగ పరుగులేల..!?
ఆనందపు పొందుకొరకు - కలను కూడ పరుగులేల..!?
వెలుగుపూల తోటలోని - మకరందము నీ భావన..!
అనురాగపు వెన్నెలకై - అడుగడుగున పరుగులేల..!?
పని చేయగ పరవశించు - గుణమెంతో సౌఖ్యప్రదము..!
కాలవీణ రాగాలను - దోచుకొనగ పరుగులేల..!?
విను ముచ్చట లేని మదికి - విందులేవి నచ్చవులే..!
మెలకువ ఫలమందు కొరకు - మౌనమవక పరుగులేల..!?
మనసు ముంచు మాయ మాటు - అందాలకు గొడుగు చూడు..!
పాఠమైన నీడ వెలుగు - పట్టలేక పరుగులేల..!?
చిరునవ్వుల వేణువూదు - 'మాధవు'డే నీకు సాక్షి..!
పట్టునిచ్చు శ్వాస జలధి - మునుగ లేక పరుగులేల..!?
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు