475..
ఈ పుడమిని 'బడి'లాగా భావిస్తే జ్ఞానమందు..!
ప్రతి జీవిని దైవంగా భావిస్తే శాంతమందు..!
తృప్తి యొక్క చిరునామా లేదు చూడ కోర్కేవెంట..!
ప్రతి తలపును అందంగా శిల్పిస్తే స్వర్గమందు..!
పూల భాష వింటుంటే మధువెందుకు వేరేగా..!
ప్రతి క్షణము చెలిమి తోట విహరిస్తే సౌఖ్యమందు..!
ప్రేమ పాఠమెప్పుడైన మధుర గీతమౌను..!
జన్మ నిడిన శ్వాసజలధి గమనిస్తే సకలమందు..!
ఏ పాటకు ఏ రాగం కూర్చాలో చెప్పాలా..!
మౌనముగా మనసుమనసు పలికిస్తే భావమందు..!
'మాధవు'నకు రాధమల్లె నీవు నాకు దక్కినావు..!
అమృతమధుర నీ సొగసులు అందిస్తే భాగ్యమందు..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు