498..
ప్రణయగీత మల్లుకొందు..ప్రాణశిల్ప లలితాంగీ..!
అరకన్నుల గాంచుచుందు భావగగన చిత్రాంగీ..!
ఎందుకంత గుబులు నీకు..నేనున్నా నీ తోడుగ..!
భాష లేని సొగసు చిందు..పుష్యరాగ సరసాంగీ..!
లాస్యమేది నీ పెదవుల..మాయమాయె నెందులకు..!?
దిగులు తీర్చి శాంతినిడుదు స్నేహసంద్ర హాసాంగీ..1
భయమేలా..జ్ఞాపకాల తెరలు కాల్చు శక్తి నీవు..!
తాపాలకు వగలు నేర్పు స్వప్న కావ్య మోహాంగీ..!
కను మలగని ఎదురుచూపు స్వర్గ సమము సత్యముగా..!
ఎలకోయిల స్వరము మీటు అమృతమధుర మౌనాంగీ..!
ఆ''మాధవ'' కోవెలలో ధ్యానమగ్న ఓ రాధా..!
నిజ శ్వాసల దారి చూపు దివ్య విమల జ్ఞానాంగీ..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు