501..
ఇలా నిన్ను చూస్తుంటే సమయమసలు తెలియదుగా..!
నువ్వు నన్ను చూస్తుంటే లోకమసలు తెలియదుగా..!
మెరుపుతీవ కన్నులలో ఎంత శక్తి నింపేవో..?!
అందాలని చూస్తుంటే వేగమసలు తెలియదుగా..!
ప్రతి కణమున అమృతమధువు లేల చేర్చేవో..!?
పాడాలని చూస్తుంటే రాగమసలు తెలియదుగా..!
వర్షించే పనిలోనే ఎలా మునిగి ఉంటావో ..!?
చెప్పాలని చూస్తుంటే సరసమసలు తెలియదుగా..!
ఏకాంతపు మందిరాన మెలకువలకు మహరాణివి..!
వివరించగ చూస్తుంటే విరహమసలు తెలియదుగా..!
'మాధవు'నే చేరేందుకు ఆరాటం మంచిదిలే..!
రెండుకనుల చూస్తుంటే సత్యమసలు తెలియదుగా..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు