527..
నా శ్వాసకు అద్దమీవె..చిలిపికనుల స'రసాంగీ..!
నీతో'నా..! యుద్ధమాయె.. ఎంత వింత స'రసాంగీ..!?
నవమోహన వసంతాల..పల్లవాలు నీ పదములు..!
ముద్దాడగ వశమౌనే..వెర్రిగాక..స'రసాంగీ..!?
మోయలేని జారుపైట..లేదు నీకు వర్ణనేల..!?
అక్షరాలకందవులే..వేదరూప స'రసాంగీ..!
సెలయేరుల వాలుజడల..నాట్యాలకు కావ్యాలా..!?
వసివాడని వెలుగుపూల..నిత్యహాస స'రసాంగీ..!
మంచునదుల మానసముల ప్రవహించే తీరేమో..!?
మౌనవీణ తంత్రులలో..రాగలాస్య స'రసాంగీ..!
'మాధవు'నే పలికించే..వేణుగాన వినోదినీ..!
నా తలపుల బృందావని..సత్యసుధల స'రసాంగీ..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు